Posts

KSHIPANI

Image
  క్షిపణీ ఉషా యస్ డానీ             “నా పేరుదేముందిలెండి.   ఇది నా ఒక్కడి సమస్యకాదుగా! లక్షమందిమి వున్నాం. నాకిప్పుడు డెభ్భయి రెండేళ్ళు. మా నాన్నగారు బుధబాలంగా నదిమీద పడవ కాంట్రాంక్టు చేసేవారు. మూడేళ్లకో పర్యాయం పాట వుండేది. ఆయన జాతియోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. అది బ్రిటీషువాళ్లకు నచ్చలేదు. పాట కాలం ఏడాది తిరక్కుండానే కాంట్రాక్టు రద్దు చేశారు. పైపెచ్చు మూడేళ్ళయ్యాక కాంట్రాక్టు సొమ్ము కట్టమని మామీద వత్తిడి తెచ్చారు. మా ఇల్లు జప్తు చేశారు. సామాన్లన్నీ ఎత్తుకుపోయారు. గొడ్లని తోలుకుపోయారు.             నేను మూడో తరగతి చదివా. ఎలిమెంటరీ స్కూల్లో. మూడో తరగతి అంటే మీకు   తెలుసుగా! ఇక చదువు సాగలేదు.             నాన్నగారితోపాటే కాంగ్రెస్ లో తిరిగేవాడ్ని. గాంధీగారి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నా. ఆ రేవు ఇక్కడే వుంది. పది కిలోమీటర్లు దగ్గర్లో! దాన్ని ఇప్పుడు గాంధీఛతర్ అంటున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నా. జైల...

Chavu Neellu

Image
  *చావునీళ్ళు* *ఉషా యస్ డానీ*               దిక్కులేని శవాలకు పేర్లుండవు ,   వేదాద్రి రేవులో అందరికీ ఆమె శవంగానే తెలుసు .   దిక్కులేని శవాలకు కథలుంటాయి . ఈ శవానికీ ఒక కథుంది . ఈ శవం కథ చాలామందికి తెల్సు . అంటే , వాళ్ళందరికీ ఈ కథ మొత్తంగా తెలుసనీకాదు . ఒక్కొక్కరికీ ఒక్కొక్క ముక్క తెల్సు . తెలిసినవాళ్లంతా ఒకచోట చేరి ఒకరి వెంట ఒకరు ఒక్కో ముక్క చెపితే బావుణ్ణు ; దిక్కులేని శవాల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసేవి . కానీ వాళ్ళు అలా ఒక చోట కూర్చోవడం కుదరదు . కుదిరినా నోరు విప్పి కథ చెప్పడం అంతకన్నా కుదరదు .               ఆమె శవం ఎలాగూ దిక్కులేనిదే . ఆ శవం కథకూ ఇప్పుడు దిక్కు లేకుండాపోయింది .   శవం మీది చీరా జాకెట్టునిబట్టి , బోసి మెడనుబట్టి , బోసి నుదిటినిబట్టి , గిల్టు గాజుల్నిబట్టి ఆమె భర్త ముందేపోయాడని చూసినవాళ్లకు ఇట్టే తెలిసిపోతుంది . ఆమెకు ఆరు పదుల వయస్సు ...