One Boy and Six Women
ఒక అబ్బాయి ఆరుగురు అమ్మాయిలు
కథ
– కథనం – సంభాషణలు
డానీ
ఓ యువకుడు తనను ద్వేషించే
అమ్మాయి ప్రేమను పొందడం.
ఓ అమ్మాయి తాను ద్వేషించే అబ్బాయిని గాఢంగా ప్రేమించడం
SCENE-1 BREAK-UP
స్టార్ రెస్టారెంట్
– NIGHT - INT
బ్లాక్ స్క్రీన్.
మాటలు
వినిపిస్తున్నాయి.
అమ్మాయి ఒక అబ్బాయిని తిడుతోంది.
"నువ్వు క్యాసనోవ "
"ప్లే బాయ్ "
"ఫిలాండరర్ "
"లొథారియో"
"డాన్ జుయాన్".
స్క్రీన్ ఓపెన్ అయింది.
ESTABLISHIN
SHOT ఒక స్టార్ రెస్టారెంట్, రాత్రివాతావరణం.
MEDIUM SHOT - ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఓమూల టేబుల్ కు ఎదురెదురుగా కూర్చుని వున్నారు.
అమ్మాయి
చాలా ఆవేశంగా వుంది.
అబ్బాయిని
తిట్టీ తిట్టీ ఆయస పడుతోంది.
అబ్బాయి
ఆమెనే ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ప్లేటులో
మిగిలిన చికెన్ ముక్కను ఫోర్క్‍తో కసిగా పొడిచి, నోట్లో వేసుకుని కసుక్కున కొరికింది.
నీళ్ళ
గ్లాసు తీసుకుని గబగబా రెండు గుటకలు మింగింది.
ఆ
తరువాత షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు కుడిచేయి
చాచింది.
అబ్బాయి
కూడా కుడి చేయి చేయి చాచాడు.
అమ్మాయి
కళ్ళు పెద్దవిచేసి
“బ్రేకప్! బ్రేకప్!
బ్రేకప్!” అని అరిచింది.
“ట్రిపుల్
బ్రేకప్ అన్యాయం” అన్నాడు అబ్బాయి.
“నీలాంటివాడికి
వందసార్లు బ్రేకప్ చెప్పాలి” అంది అమ్మాయి.
అలా
అంటూ విసురుగా కుడివైపుకు వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది.
అదే
సమయంలో అబ్బాయి కూడా ఎడమ వైపుకు నడిచాడు.
(మధ్యలో
టేబుల్. అటు అమ్మాయి వెళిపోతున్నది. ఇటు అబ్బాయి వెళిపోతున్నాడు. ఇది మన వాల్ పోస్టర్
స్టిల్).
మళ్ళీ బ్లాక్ స్క్రీన్
“రెండేళ్ళ
తరువాత”
అని
అక్షరాలు కనిపిస్తున్నాయి.
SCENE- 2 HOTEL 5 – STARS
మాధాపూర్ –
హైటెక్ సిటీ – DAY – EXT
TILT DOWN SHOT – కెమేర ఆకాశంలో నుండి, ఐటీ కంపెనీల బిల్డింగుల
మీదుగా కిందికి దిగుతోంది.
ఐటీ కంపెనీల బిల్డింగుల మధ్య ఖాళీ స్థలంలో ఫాస్ట్ ఫుడ్ బండ్లున్నాయి.
ఐటీ వుద్యోగులు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకుని టిఫిన్లు
లాగించేస్తున్నారు.
PAN SHOT కెమేర టిఫిన్లు తింటున్న వారి మీదుగా ప్యాన్వుతూ
ముందుకు సాగుతోంది.
వాళ్ళు టిఫిన్తింటూ మాట్లాడుకుంటున్నారు.
“ఇన్ఫోసిస్ డిజప్పాయింటెడ్ ”
“టీసియస్ కూడా”
“హెచ్ సిఎల్ మాత్రం
తక్కువ చేసిందా?”
“విప్రో ఆల్సో జాయిన్డ్ ద బ్యాండ్ “
కెమేర ఒక బండి ముందు ఆగింది.
దాని మీద HOTEL 5 STARS అని రాసుంది.
“అప్పుడు ఫైవ్ స్టార్ హొటళ్ళలో తినేవాళ్ళం. ఇప్పుడు హొటల్
ఫాట్వ్ స్టార్ లో తింటున్నాం”
“జస్ట్ నేమ్ ఛేంజ్డ్
“
“లైఫ్ స్టైల్ ఛేంజ్డ్”
“ఈరోజు రెండు కంపెనీలు పింక్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయంటా. కన్ ఫర్మ్ న్యూస్”
టిఫిన్లు తింటున్నవాళ్ళు ఒక్కసారిగా వులుక్కి పడ్డారు.
గోలగోలలో ఆ తరువాత వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించడం లేదు.
వాళ్ళంతా ఆందోళనలో పడిపోయారనిమాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
BLUR SHOT – సీన్ మసగ్గా మారిపోయింది.
SCENE- 3 RIGISTRAR OFFICE
ల్యాండ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు – DAY – EXT
SET UP SHOT – ల్యాండ్ రిజిస్ట్రార్
ఆఫీసు.
భూములు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, బ్రోకర్లు, ఆఫీసు స్టాఫ్
అంతా హడావిడిగా వున్నారు.
PAN SHOT – కెమేర రిజిస్ట్రార్ఆఫీసు గేటులోంచి రోడ్డు మీద
ప్యాన్ అవుతోంది.
రిజిస్ట్రార్ ఆఫీసుకు దగ్గర్లో ఒక రెస్టారెంట్ కనిపిస్తోంది.
అక్కడా అదే హడావిడి.
ఒక టేబుల్ మీద ఓ మొగుడూ పెళ్ళాం కూర్చొని వున్నారు.
భార్య :
ఈ బ్రోకర్ ఏంటీ? ఇంకా రాలేదు.
భర్త :
సబ్ రిజిస్ట్రార్ ని లైన్లో పెట్టాలిగా.
భార్య :
తోందరగా రాయించుకోవాలి. ఇవ్వాళ వున్న రేటు రేపు వుండడంలేదు.
భర్త :
అమ్మేవాళ్ళకు ఆశ ఎక్కువ. రోజు గడిస్తే ఎకరాకు పది లక్షలు పెంచేస్తున్నారు.
భార్య :
హైదరాబాద్ లో ఇంకా నయం. విజయవాడలో భూముల రేట్లు రోజుకో కోటి పెంచేస్తున్నారు.
భర్త :
కొత్త రాజధానికదా? క్రేజ్ !
భార్య :
లాస్ట్ ఇయర్ తుళ్ళూరులో ఎకరం పదిహేను లక్షల పొలం కోటిన్నరకు
పోయింది. టెన్ టైమ్స్!.
భర్త :
ప్రతి పొలానికీ ఒకరోజు వస్తుంది.
భార్య :
వచ్చింది గానీ … నిలబడలేదు
భర్త :
ఢమాల్ అని పడిపోయివుంటుంది.
భార్య :
ఇప్పుడు సగం రేటుకు కొనేవాళ్ళు కూడా లేరు.
భర్త :
భూమిని
ఇంతకుముందు స్థిత్రాస్తి అనేవారు.
భార్య
:
అదిప్పుడు
గుర్రపు పందాలకన్నా అన్యాయంగా మారిపోయింది.
భర్త :
ల్యాండ్
డీలింగ్ అమ్మాయిలతో డీలింగ్ ఒక్కటే
భార్య :
ఏంటదీ?
భర్త :
మనం
ల్యాండ్ మీద క్రేజ్ పెంచుకుంటే దాని డిమాండ్ పెరిగిపోతూ వుంటుంది.
భార్య :
మరి
అమ్మాయిలూ
భర్త :
మనం
వాళ్ళను ఎంత ఎక్కువగా ఇష్టపడితే వాళ్ళ డిమాండ్స్ కూడా అంతగా పెరిగిపోతుంటాయి.
భార్య బుంగమూతి పెట్టింది.
భర్త :
అలా ముఖం మాడ్చుకోకు. నీ కొసమే ఈ డీల్ సేట్ చేశా. రిజిస్ట్రేషన్ కూడా నీ పేరునే చేయిస్తున్నా.
అంతలో బ్రోకర్ వచ్చాడు.
బ్రోకర్
:
మొన్నటి
దాక రిజిస్ట్రార్ ఈగలు తోలుకుంటూ కూర్చునేవాడు. ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫీసు రేసు కోర్సులా
మారిపోయింది.
ముగ్గురూ
కలిసి బయటికి వచ్చి సబ్రిజిస్ట్రార్ ఆఫీసు వైపుకు నడుస్తున్నారు.
అప్పుడే
వాళ్ళకు ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి ముందుకు పోతోంది.
మనకు ఆ అమ్మాయి వీపు మాత్రమే కనపడుతోంది.
FLOWCAM SHOT – కెమేర అమ్మాయిని వెనుక నుండి ఫాలో అవుతోంది.
అమ్మాయి రోడ్డు వెంట బిల్డింగులు చూసుకుంటూ నడుస్తున్నది.
ఒక బిల్డింగు దగ్గర ఆగి అనుమానంగా చూసింది.
అప్పుడు ఆమె ముఖం ఒక పక్క నుండి సగం కనిపించింది.
పూర్తి ముఖం ఇంకా కనిపించలేదు.
నెమ్మదిగా ఆ పక్క వీధిలోనికి నడిచింది.
కెమేర ఆమెను ఫాలో అవుతోంది.
ఆ వీధిలోనికి జనం వస్తున్నారు. పోతున్నారు.
వచ్చేవాళ్ళను చూస్తూ ఆమె ముందుకు నడుస్తూ వుంది.
SCENE- 4
CRIKET
BETTING
CRICKET
BETTING HALL – DAY – INT
అది క్రికెట్ బెట్టింగ్ హాల్.
మ్యాచ్ మొదలు కావడానికి మరో పది నిముషాలుంది.
అంతా హడావిడిగా వుంది.
Protagonist :
లవ్ అండ్ క్రికెట్ ఒకటే.
ఫ్రెండ్ :
క్రికెట్ ను ప్రేమించవచ్చు. ప్రేమలో సిక్సర్లు కొట్ట వచ్చు.
ఆ అమ్మాయి ఆ హాలులోనికి ప్రవేశించింది.
ఎవరినో వెతుకుతూ అటూ ఇటూ నడుస్తోంది.
Protagonist :
నీకు కాన్సెప్ట్ అర్ధం కాలేదు. క్రీజ్ లో పాతుకుపోతే పరుగులు
చ్వరదలా వస్తాయి. ప్రేమలోనూ అంతే ఓపికగా ఎదురుచూడాలి. అప్పుడు ప్రేమ వరదలా పొంగి పారుతుంది.
ఫ్రెండ్ :
ఇప్పుడు అమ్మాయిలు అంత ఓపికగా ఎవరూ లేరు బ్రదర్. నీ థీయరీ
టెస్టు మ్యాచులకు ఓకే. కానీ ఇప్పుడు ఎవరూ టెస్టు మ్యాచుల్ని లైక్ చేయడంలేదు. అంతా ట్వంటీ
ట్వంటీనే. ఇంటర్ పాసయ్యే నాటికే నాలుగు బ్రేకప్ లు వుంటున్నాయి.
Protagonist :
బ్రేకప్! ఆ మాట అంటే నాకు చాలా భయం.
అలా అంటూ పక్కకు తిరిగాడతను.
ఎదురుగా ఆ అమ్మాయి నిలబడివుంది.
అదే అమ్మాయి సినిమా మొదట్లో అతనికి బ్రేకప్ చెప్పిన అమ్మాయి.
ఆశ్చర్యపోయాడతను.
Protagonist :
నువ్వూ? ఇక్కడా? హౌ?
Lady Protagonist :
నాకు డబ్బులు కావాలీ?
Protagonist :
ఎంత కావాలీ?
Lady Protagonist :
నేను నిన్ను అప్పు అడగడానికి రాలేదు. నా డబ్బులు వసూలు చేసుకోవడానికి
వచ్చాను.
Protagonist :
నీ డబ్బులా?
Lady Protagonist :
రెండేళ్ళ క్రితం తీసుకున్నావుగా రెండూ లక్షలు.
Protagonist :
ఓ. అదా?
Lady Protagonist :
ఇప్పుడే కావాలి. ఈ క్షణమే కావాలి.
Protagonist :
ఇప్పుడే కదా చెప్పావు. తప్పకుండా ఇస్తాను. కొంచెం టైమియ్యి.
Lady Protagonist :
చాలా టైమిచ్చాను. టూ ఇయర్స్.
Protagonist :
అప్పిచ్చి టూ ఇయర్స్ అయింది కదా అని టూ మినిట్స్ లొ ఇమ్మంటే
ఎక్కడ నుండి వస్తాయీ? నీ బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్ ఇవ్వు. మనీ ట్రాన్స్ ఫర్ చేస్తా.
Lady Protagonist :
నేను నిన్ను నమ్మను. డబ్బిచ్చే వరకు నిన్ను వదలను.
Protagonist :
నన్ను వదలవా? ఈ ఆఫర్ బాగుందే.
Lady Protagonist :
ఐ యామ్ సీరియస్. డబ్బిచ్చే వరకు నిన్ను బతకనివ్వను.
Protagonist :
ముందు ఒక టీ వేసి ఓ దమ్ము లాగి ఆలోచిస్తా. నడు.
SCENE- 5
TEA BUNK
TEA BUNK –
DAY – EXT
Protagonist,
Lady Protagonist ఇద్దరూ టీ క్యాంటీన్ వైపుకు నడుస్తున్నారు.
ముందు Protagonist నడుస్తున్నాడు.
వెనక Lady Protagonist నడుస్తోంది.
అతను పారిపోకుండా చేయిపట్టుకున్నది.
Protagonist :
నువ్వు చేయి పట్టుకోవడం బాగుంది.
Lady Protagonist :
నువ్వు పారిపోతావనీ.
Protagonist :
ఓ ఆడవాళ్ళు మగాళ్ళ చేయి పట్టుకోవడానికి రెండు అర్ధాలు. ఒకటి
ప్రేమతో, రెండోది పారిపోకుండా.
Lady Protagonist :
రెండు అర్ధాలు ఏమీలేవు. ఒక్క అర్ధమే వుంటుంది. ప్రేమతో పట్టుకున్నా,
కోపంతో పట్టుకున్నా మగాళ్ళు తప్పించుకోకూడదనే.
వాళ్ళిద్దరూ టీ క్యాంటీన్ దగ్గరికి చేరుకున్నారు.
Protagonist :
నువ్వు టీ తాగవుగా, నీ కోసం కాఫీ చెపుతాను.
Lady Protagonist :
నీ కాఫీ నాకు అక్కర లేదు.
Protagonist :
ఇది నీ కాఫీయే. నా టీకి కూడా నువ్వే డబ్బులు ఇవ్వాలి.
Lady Protagonist తన పర్సులో నుండి వంద రూపాయల నోటు తీసి
ఇచ్చింది.
Protagonist :
దీన్ని కూడా నా అప్పులో కలిపేసుకో. అన్నీ కలిపే తీర్చేస్తా.
ఆ అమ్మాయి తీక్షణంగా చూసింది.
తననెళ్ళి ఇద్దరికీ టీ, కాఫీలు తెచ్చాడు.
టీ తాగుతూ అతని వైపు ఒకసారి చూసిందామె.
అతను అమాయికంగా. బలహీనంగా నవ్వుతున్నాడు.
ఇద్దరూ తాగేశారు.
ఇద్దరి కప్పు సాసర్లు అతను తీసుకుళ్ళి ఇచ్చేశాడు.
సిగరెట్టు కాల్చుకుంటూ తిరిగి వచ్చాడు.
Protagonist :
నేను రెండు మూడు రోజుల్లో డబ్బు ఇస్తాను. కొంచెం బ్రీథింగ్
టైమ్ ఇవ్వు.
Lady Protagonist :
కలిసి టీ తాగాను కదాన అడ్వాంటేజ్ తీసుకోకు.
Protagonist :
అయితే ఒకసారి నీ ఫోనివ్వు.
Lady Protagonist :
నీ ఫోన్ ఏమయిందీ?
Protagonist :
నువ్వు ఇంతకు ముందు షార్ప్ గా వుండేదానివి.
Lady Protagonist :
అంటే ?
Protagonist :
ఫోన్ లో బ్యాలెన్స్ వుంటే అది చేతిలోనో చెవి దగ్గరో వుంటుంది.
బ్యాలెన్స్ లేకపోతే జేబులో వుంటుంది. నా ఫోన్ కు ఇన్ కమింగ్ ఛాన్సు కూడా లేదు.
Lady Protagonist అతన్ని పురుగును చూసినట్టు చూసింది.
Protagonist :
ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది. ఫోన్ లో బ్యాలెన్స్ లేనపుడు
మొబైల్ ను ఇంట్లో మరచిపోయానని చెప్పాలి.
తరువాత తన చెల్ ఫోన్ ను చిరాకుగా అతని చేతిలో పెట్టింది.
Protagonist తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు.
అన్ని ఫోన్లూ ఆడపిల్లలలకే చేస్తున్నాడు.
వాళ్లతో అతను చనువుగా మాట్లాడుతుంటే Lady Protagonist కి
కంపరంగా వుంది.
అలా తను పది ఫోన్లు వరకు చేశాడు.
Lady Protagonist :
అలా ఫోన్లు చేస్తూనే వుంటావా?
Protagonist :
అప్పు పుట్టించడం అంత ఈజీకాదు. పది మందికి ఫోన్ చేస్తే ఒక్కరు
కూడా రెస్పాన్డ్ అవ్వరు. నేను ఆరుగుర్ని ఒప్పించా.
Lady Protagonist :
అప్పు
పుట్టించడం మీద గొప్ప పరిశోధనలు చేసినట్టున్నావుగా
Protagonist :
అంత
ఓపిక నాకు లేదు. యూ క్నో ? అప్పు అనేది గ్లోబల్
కల్చర్. సియం నుండి పియం వరకు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు అందరూ అప్పు పుట్టించేందుకు
కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడుతుంటారు. నేను జస్ట్ వాటిని ఫాలో అవుతాను.
Lady Protagonist :
సరే వ్హాట్ నెక్స్ట్ ?
Protagonist :
నేను వెళ్ళి క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు కార్లో వచ్చావా?
Lady Protagonist :
అవును. మెయిన్ రోడ్డు
మీద పార్క్ చేశాను.
Protagonist :
అయితే నడూ. క్విక్.
మరో అవకాశం ఇవ్వకుండా ప్రోటోగానిస్ట్ కార్ పార్కింగ్ వైపుకు
నడిచాడు.
SCENE- 6 ONLINE MONEY TRANSFER
INSIDE
CAR – DAY – INT
అమ్మాయి కారులో ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చోంది.
అబ్బాయి వచ్చి లెప్ట్ సీటులో కూర్చున్నాడు.
Lady Protagonist :
ముందు సీట్ బెల్టు వేసుకో. ముందుకు పడతావు.
అతను సీటు బెల్టు వేసుకున్నాడు.
Protagonist :
నీదంతా డిఫెన్స్ మెకానిజమ్.
అమె బయటికి ఎలాంటి భావాలూ కనిపించకుండా మౌనంగా కారు స్టార్ట్ చేసింది.
Lady Protagonist :
ఎక్కడికీ పొవాలీ?
Protagonist :
ధూల్ పేట.
Lady Protagonist :
నీకు తగ్గ ఏరియా.
Protagonist :
హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబిలీ హిల్స్
మాత్రమే కాదు. ధూల్ పేట, శాలిబండ, చింతల్ బస్తీ, పార్శీ గుట్ట ఆల్ పార్ట్ అండ్ పార్సియల్
ఆఫ్ హైదరాబాద్.
Lady Protagonist
అతని వైపు చిత్రంగా చూస్తూ కారు నడుపుతోంది.
Protagonist కారి రియర్ వ్యూ మిర్రర్ లో తల సరిచేసుకుంటూ తనలో తాను నవ్వుకుంటున్నాడు.
Protagonist :
నువ్వు రియల్లీ రియల్లీ గ్రేట్!
Lady Protagonist :
దేనికీ?
Protagonist :
నేను చాలా మంది రికవరీ టీం మెంబర్స్ ని చూశా. ఇలా టీ కాఫీ
ఇచ్చి, ఫోన్ ఇచ్చి, కారు కూడా అరెంజ్ చేసింది నువ్వు ఒక్క దానివే.
ఆమె అతని మాటల్ని పట్టించుకునే స్థితిలో లేదు.
Lady Protagonist :
ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ చేయ్మని అడగవచ్చుగా.
Protagonist :
దటీజ్ బ్యాడ్ ఐడియా.
ఎందుకూ? అన్నట్టు చూసిందామె.
Protagonist :
ఎవరైనా
నాకు డబ్బులు ఇవ్వాలంటే క్యాష్ లోనే ఇవ్వాలి.
నా అకౌంట్లో వేశారంటే ఆ డబ్బులు నేను డ్రా చేయలేను. రెండు లక్ష రూపాయలు వేసినా నా చేతికి ఒక్క రూపాయి
కూడా రాదు.
Lady Protagonist :
నీ
ఈయం ఐ బకాయిలు ఆ రేంజిలో వుండివుంటాయి.
Protagonist :
యూఆర్
వేరీ షార్ప్.
Lady Protagonist :
రికవరీ
టీమ్ ఇంటికి వస్తే సిగ్గు వేయదా?
Protagonist :
వేస్తదా?
అంటే వేస్తది. వేయదా? అంటే వేయదు. మనం కొన్నింటికి అలవాటు పడిపోతుండాలి. ఏమంటారూ దాన్నీ?
... అడాప్టబిలిటీ.
Lady Protagonist :
హూ.
అందామే
అసహనంగా.
Protagonist :
నీకో
విషయం తెలుసా? సత్యహరిశ్చంద్రా నాటకంలో నక్షత్రకుడు తెలుసుగా. అతనే మనకు ఫస్ట్
రికరీ టీమ్ లీడర్. నాకు కూడా ఈమధ్య
తెలిసింది.
Lady Protagonist :
రికరీ
టీమ్ లీడర్ చెప్పాడా?
Protagonist :
ఎగ్జాక్ట్లీ
!
Lady Protagonist :
అతితెలివితేటలు నేర్చావు.
Protagonist :
యూ
నో? ఎవరూ ఏదీ నేర్చుకోరు. జీవితం అన్నీ నేర్పుతుంది.
Lady Protagonist :
బతకడం
మాత్రం నేర్పదా?
Protagonist :
బతకడం
కూడా నేర్పుతుంది. కానీ ఒకరి బతికే తీరు మరొకరికి నచ్చదు. అదే అసలు సమస్య.
ఆమే
మౌనంగా వుండిపోయింది.
కారు
ధూల్ పేట వైపుకు వేగంగా పోతున్నది.
Protagonist :
ఇక్కడ
లెఫ్ట్ టర్న్ తీసుకుని కల్లు కాంపౌండ్ దగ్గర
ఆపు.
Lady Protagonist :
టూరిస్టులు
చార్మినార్, గోల్కొండఖిలా, హుస్సేన్ సాగర్, జూ చూసేసి హైటెక్ సిటీలో నాలుగు రౌండ్లు
వేసేస్తే హైదరాబాద్ చూసేశాం అనుకుంటారు. కల్లు
కాంపౌండ్ చూడకపోతే హైదరాబాద్ చూసినట్టుకాదు.
Protagonist :
వున్నయ్.
ప్లీజ్ వెయిట్ అండ్ సీ.
SCENE- 7 DHOOLPET
ROAD – DAY – EXT
కారు
వచ్చి కల్లు కాంపౌండు ముందు ఆగింది.
అక్కడి
వాసనకు అమ్మాయి ముక్కు మూసుకుంది.
Protagonist :
నువ్వు
ఇక్కడే వుండు. నేను లోపలికి వెళ్ళివస్తా.
Lady Protagonist :
నేను
నిన్ను నమ్మను. నేనూ వస్తా.
అంటూ
ఆమె కారు దిగి డోర్ లాక్ చేసింది.
Protagonist :
ఒకప్పుడు
నాకు తోడు నీడగా వుండమని నిన్ను అడిగాను. దాని అర్ధం ఇదికాదనుకుంటా?
ఆమె
విసురుగా అతని వైపు చూసింది.
SCENE- 8 KALLU COMPOUND
KALLU
COMPOUND – DAY – INT
కల్లు కాంపౌండ్ ఉదయమే తాగుబోతులతో కిటకిట లాడిపోతోంది.
జనం కల్లు తాగుతూ, ఆబకాయ బద్ద చీకుతూ తెగ ఊగిపోతున్నారు.
ఓ భారీ పర్సనాలిటీ మహిళ దానికి ఓనరు.
ఆమె తెలంగాణ గౌడ సామాజికవర్గానికి చెందిన మహిళ తాయారమ్మ.
ఆమె ముందు ఒక తాగుబోతు వచ్చి నిలబడ్డాడు.
తాయారమ్మ :
ఎంత తాగావూ?”
తాగుబోతు :
మూడు గ్లాసులు
తాయారమ్మ :
నీ వాలకం చూస్తుంటే మూడు గ్లాసులతో సరిపెట్టినట్టు లేవే.
తాయారమ్మ తన అసిస్టెంటు వైపు చూసింది.
తాయారమ్మ :
ఏరా వీడి ఏంత తాగాడూ?
అసిస్టెంటు :
పది గ్లాసులు. రెండు బోటీలు.
తాయారమ్మ :
ఏరా! మూడే గ్లాసులన్నావూ?
తాగుబోతు :
నాకు మూడు గ్లాసులే గ్లాసులే గుర్తున్నాయి. ఆ తరువాత ఏం జరిగిందో గుర్తులేదు.
తాయారమ్మ :
ఇక్కడ తాండూరు తాయారమ్మ. వీపు వంచి రెండు గుద్దులు గుద్దితే తాగిందంతా బయటికి
వస్తది. నేనే చెపుతా ఎన్ని గ్లాసులు తాగావో.
తాగుబోతు :
ఆ పని చేయమాక. డబ్బులు రేపు ఇస్తా.
తాయారమ్మ :
నేను ఎలా అనిపిస్తున్నాన్రా? ఈడ బోర్డు చూడు. ఈరోజు నగదు.
రేపు అరువు.
తాగుబోతు :
ఛీ నీయమ్మా. నాలుగేళ్ళుగా ఇక్కడ తాగుతున్నాను. ఒక్క రోజు
కూడా ఆ రేపు రాలేదు. నాకు అప్పు ఇవ్వలేదు.
తాయారమ్మ :
ఇంకో నాలుగేళ్ళు తాగు. అప్పుడు వత్తది.
తాగుబోతు డబ్బులిచ్చి తల ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు.
Protagonist, Lady Protagonist ఇద్దరూ అక్కడికి చేరారు.
తాయారమ్మ :
ఏం బుల్లోడా! అంతా
మంచిగేనా? పోరిని కూడా తీసుకొచ్చినవ్. పోరి మస్తుగున్నది.
Lady Protagonist ఇరకాటంగా చూసింది.
Protagonist :
అంతా మంచిగనే కానీ నువ్వు ఇంకా కల్లు కాంపౌండులోనే గడపడం మంచిగ లేదు.
తాయారమ్మ :
ఏం చేయమంటవూ? కల్లూ దుకానం లేపేయ మంటవా? ముగ్గురు పిలకాయలున్నారు.
మొగుడు ఏడికో పారిపోయాడు. ఏం చేయాలే?
Protagonist :
నా దగ్గర మస్తు ఐడియాలున్నాయి. కల్లుతో సిర్కా చేస్తారు.
ఇది యునానీ వైద్యంలో వుంది. సిర్కా అంటే వెనిగర్. వెనిగర్ అంటే ….
తాయారమ్మ :
గసుంటివి మనకు తెలీదబ్బాయా.
Protagonist :
పెద్ద పెద్ద హోటళ్ళలో వెనిగర్ కు మస్తు గిరాకి. పైగా వాళ్ళు
వాడేది సింథటిక్ వెనిగర్. నేను చెప్పేది ఆర్గానిక్
వెనిగర్. నువ్వు నా మాట విని ఒక తూరి ప్రయత్నించు.
తాయారమ్మ :
గా ముచ్చటి వద్దీ. గవన్ని నువ్వు చేస్తావా చెప్పు? రేపే పెట్టించేస్తా. నువ్వు నా
ముందు వున్నావనుకో నాకు లష్కర్ కు పోయినట్టుంటది.
వాళ్ళిద్దరి మాటలు Lady Protagonist కు కంపరం పుట్టిస్తున్నాయి.
Protagonist :
వుంటా. నీ ఆర్గానిక్ వెనిగర్ ఫ్యాక్టరీని దగ్గరుండి ఓపెన్
చేయిస్తా.
తాయారమ్మ :
నువ్వు అట్లనే అంటవు. కొత్త పోరి దొరగ్గానే తుర్రుమంటవు.
Protagonist మొగమాటంగా Lady Protagonist వైపు చూశాడు.
తాయారమ్మ :
సరే గానీ ఇదిగో దుడ్డు. ముఫ్పయి వేలు. లెక్కెట్టుకో.
Protagonist :
లెఖ్ఖపెట్టుకో అక్కరలేదు. నీవ్వు కరెక్టుగా వుంటావు.
తాయారమ్మ :
నీ నమ్మకం పాసిగూల. ఓపాలు లెక్కెట్టుకుంటే నీ సొమ్మేం పోతాదీ?
Protagonist :
నాకు నీ మీద నమ్మకం.
తాయారమ్మ మురిసిపోయింది.
తాయారమ్మ :
ఓ పోరి. నీకతంతా నాకు తెలుసు. పోరడు పూరాగా చెప్పిండు. నువ్వేదో
పచ్చిమిరపకాయ బజ్జీ తిని చురచురలాడుతున్నావటగా? పోరడు మంచోడు. నా మొగుని లాంటోడు కాదు.
అనుభవం మీద చెపుతున్నా. నిన్ను మంచిగ చూసుకుంటడు.
అనుభవం మీద అన్నప్పుడు తాయారమ్మ ముఖంలో ఓ చిత్రమైన మైకం కనిపించింది.
తాయారమ్మ అలా చొరవగా మాట్లాడడం Lady Protagonist కు ఇష్టంగాలేదు.
కోపంగానే గుమ్మం
వైపుకు నడిచింది.
Protagonist :
తాయారమ్మా! రేపు కలుస్తా.
అంటూ గుమ్మం వైపుకు పరుగెట్టాడు Protagonist.
SCENE- 9 MARRIAGE TOPIC
CAR – DAY – INT
అమ్మాయి కార్లో డైవర్ సీట్లో కూర్చొని వుంది.
అసహనంగా ఏంటో ఆలోచిస్తూ వుంది.
అతను వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
Lady Protagonist :
సీటు బెల్టు పెట్టుకో
దాదాపు అరిచినట్టే చెప్పిందామె.
అతను సీటు బెల్టు పెట్టుకున్నాడు.
Lady Protagonist :
నెక్స్ట్ ?
Protagonist :
హుస్సేనీ ఆలం రోడ్. పురానా పూల్ కు సౌత్ సైడ్.
Lady Protagonist :
నువ్వే దారి చెప్పు.
Protagonist :
హమ్మయ్యా. ఇట్స్ గుడ్ బిగినింగ్. ఇంకో లక్షన్నర వచ్చేస్తే
నీ అప్పు తీరిపోతుంది.
Lady Protagonist :
లక్షన్నరకాదు. లక్షా డెభ్భయి వేలు. ఇంకా చిల్లర ఖర్చులు కూడా
వున్నాయి.
Protagonist :
చిల్లర ఖర్చులా?
Lady Protagonist :
టీ కాఫీ సిగరెట్ కారు పెట్రోలు.
Protagonist :
దిసీజ్ టూ మచ్. మనిద్దరం ఫ్రెండ్స్. అంతేకాదు అప్పుడు పెళ్ళి
కూడా ..
ఆ తరువాత అతను మాట్లాడలేకపోయాడు.
Lady Protagonist :
షటప్. పాతమాటలు వద్దు. మనది రద్దయిన సంబంధం. ముందు డబ్బుల
విషయం తేల్చు.
Protagonist :
అప్పు
ఇచ్చినవాళ్ళకు జ్ఞాపకం ఎక్కువ.
Lady Protagonist :
అప్పు
తీసుకున్నవాళ్లకు మతిమరపు ఎక్కువ.
Protagonist :
ఈయంఐ
డేట్ బ్యాంకు వాళ్ళకు గుర్తుంటుంది.
Lady Protagonist :
లోన్
తీసుకున్నవాళ్లకు గుర్తు వుండదు.
Protagonist :
నీ
దగ్గర అప్పు తీసుకుని రెండేళ్ళు దాటాయంటే నేను నమ్మలేకపోతున్నాను.
Lady Protagonist :
అప్పు
తీసుకున్నవాళ్ళకు కాలం స్పీడ్ గా పరుగెడుతుంది.
Protagonist :
అప్పు
ఇచ్చినవాళ్ళకు కాలం స్లోగా కదులుతుంది.
తను
మాట్లాడలేదు.
రోడ్డు
వేపుకు చూస్తున్నాడు.
అప్పుడే
ఆమె అతని వైపు చూసింది.
ఆమే
కోపం ఇంకా తగ్గలేదు.
Lady Protagonist :
నీకు పెళ్ళయిందని చెప్పారే.
-------------
కష్టాల్లో
వున్నానంటే డబ్బు ఇచ్చాను.
వాడు
ఇప్పుడూ కష్టాల్లోనే వున్నాడు. ఇప్పుడూ డబ్బు ఇవ్వొచ్చుగా. నువ్వు అప్పు వసూలు చేసుకోవడానికి వచ్చావు.
ఒళ్ళువంచి
కష్టపడి సంపాదించిన డబ్బు నాది.
నాది
కూడా కష్టార్జితమే. ఒళ్ళు అమ్ముకుని సంపాదిస్తున్నా.
--------------
ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళాలీ?
ఖైరాతాబాద్
లో ఒక ఫ్రెండ్ వుంది.
ఉదయం
ఖైరాతా బాద్ నుండేగా వచ్చాం.
మన
కన్వీనియంట్ టైమ్ లో అప్పు దొరకదు.
వాళ్ళ
కన్వీనియంట్ టైమ్ లో అప్పు అడగాలి
---------------------
---------------------
------------------
రేట్
పెరిగినపుడు ల్యాండ్ ను అమ్మేయాలి.
మరి
అమ్మాయిల్ని?
సేమ్
టూ సేమ్
అంటే
రిక్వైర్
మెంట్స్ పెరిగినపుడు తప్పుకోవాలి
నువ్వూ
అలాగే చేస్తావా?
ఏదో
ఫ్లోలో ఏదో వాగేసినట్టున్నామే!!!
ఫ్లోలో
కాదు ఒరిజినల్ గానే నువ్వు అది.
అది!
అది! అది!
-------------
ఇంతకు
ముందు మలక్ పేటలో గుర్రాల రేసు జరిగేది.
ఇప్పుడు
ప్రతి ఊర్లోనూ రోజూ గుర్రాల రేసే
-----------------------
ఇంతకు
ముందు రేసు ఆడాలంటే సిటీకి పోయేవాళ్ళు
ఇప్పుడు
సిటీవాళ్ళు గ్రామాలకు వచ్చి రేసు ఆడుతున్నారు.
--------------------
----------------
-----------------------
ఈలోకంలో
కనిపించేదంతా నిజంకాదు.
నిజం
ఎప్పుడూ కనిపించదు కూడా.
---------------------
-------------------
గర్ల్
ఫ్రెండ్ కు కారు డ్డైవింగ్ నేర్పడంలో ఒకపారడాక్సీ వుంది.
ముందు
అబ్బాయిలు అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పుతారు.
ఆ
తరువాత అమ్మాయిలు అబ్బాయిల్ని డ్రైవ్ చేస్తారు.
-----------------------
ఈజీ
మంత్లీ ఇన్ స్టాల్ మెంట్ లా
ఈజీ
డెట్ పాలసీ వుండాలి.
మనకు
అవసరమైదంతా ఒక్కర్నే ఇమ్మంటే వాళ్ళకు మరీ కష్టం అయిపోతుంది.
అంచేత
మన కష్టాల్నీ అందరికీ పంచాలి.
కష్టాల్ని
పంచాలా?
వీలయితే
సుఖాల్ని కూడా పంచవచ్చు.
ఇప్పుడు
మన దగ్గర కష్టాలు వున్నాయి గాబట్టి కష్టాలు పంచుతున్నాం.
రేపు
సుఖాలు వచ్చాయనుకో అదీ పంచుతాం.
-----------------------
జీవితం
బ్యాటరీ ఒక్కటే
బ్యాటరీ
అయిపోయినా, జీవితం ఆగిపోయినా కథ ముగిసినట్టుకాదు.
మళ్ళా
చార్జింగ్ పెట్టుకుని పనిచేస్తాయి.
------------------
చార్జింగు
కు కూడా పనికిరాని బ్యాటరీలు వుంటాయి.
కొన్ని
జీవితాలూ అంతే
-----------------------
వ్హేర్
ద హేల్ ఆర్ వుయ్ గోయింగ్ ?
నొనొనొ.
అమ్మాయిలతో నరకానికి వెళ్ళ కూడదు.
స్వర్గానికి
వెళ్ళాలి. ప్యారడైజ్.
ముందు
ప్యారడైజ్ సెంటర్ కు పోనీ.
అది
మన తొలి మజిలీ?
------------
పాలకూర
వండే టప్పుడు ఎప్పుడూ మూత పెట్ట కూడదు.
దాని
గ్రీన్ కలర్ మాడిపోతుంది.
ముందు
బ్లాంచింగ్ చేస్తే ఇంకా అదిరిపోతుమ్ది.
నీ
పేరెంట్స్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివించకుండా చెఫ్ కోర్స్ చదివించి వుండాల్సింది.
మా
పేరెంట్స్ ని తప్పు పట్టితే నేను ఒప్పుకోను.
అప్పట్లో
మనం బిల్ గేట్స్ కు బామ్మరిది అనుకున్నాం.
మనం
గత జన్మలో నలుడు, భీముడూ అని అప్పుడు మనకు తెలీదు.
పూటకూళ్ళామె
అయ్యుంటావు.
దటీజ్
ఆల్సో నాట్ ఏ బ్యాడ్ ఐడియా?
ఒక్కసారి
ఈ అప్పులు తీరిపోనీ.
ఒక
హోటల్ పెట్టి నలుడు, భీముడ్ని మరిపిస్తాం.
ఒక
హొటల్ కాదు చైన్ ఆఫ్ హొటల్స్.
--------------
(చాక్లెట్ తింటూ)
అబ్బా
ఇది చేదుగా వుంది.
కొందరి
జాతకమే అంతా నోట్లో చాక్లెట్ పెట్టినా చేదయి పోతుంది.
నువ్వు
నా గురించి చెపుతున్నావా?
కాదు
ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి చెపుతున్నా.
------------------
నీకు
కష్టం వచ్చిందని నా దగ్గర అప్పు తీసుకుని పారిపోయావు.
ఆడాళ్ళు
మగాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఎన్ని రకాలు అనుకుంటారో తెలుసా?
అప్పుకు
కూడా జెండర్ డిస్క్రిమినేషన్ వుందా?
-------------------
-----------------
ఎవరా అమ్మాయీ ? గర్ల్ ఫ్రెండా?
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్?
నిన్ను వదిలించుకుని వుంటుంది.
కాదు నేనే వెళ్ళిపోమన్నా. నా దగ్గర తనకు అన్నీ కష్టాలే. వేరే
చోట అయితే హ్యాపీగా వుంటుందని.
హ్యాపీగా అంటే?
ఈ విషయంలో కష్టాలు అంటే పావర్టీ. హ్యాపీ అంటే ప్రాపర్టీ.
మనం జీవితానికి చాలా అర్ధాలు వెతుకుతాంగానీ వెరీ సింపుల్
ప్రాపర్టీ పావర్టీ.
-----------
ఫిలాసఫీ పుస్తకాలు చదువుతున్నావా?
ఫిలాసఫీ చదివితే వచ్చేది కాదు. అనుభవంతో వస్తుంది.
---------------
నేను
అప్పు తీర్చడంలో ఆలస్యం చేస్తుండవచ్చు.
ఎవ్వరి
అప్పూ ఎగ్గొట్టను. అప్పిచ్చిన వాళ్ళందర్ని గుర్తు పెట్టుకుంటాను.
పద్దూ
కరెక్టుగా రాస్తుంటాను. అప్పు అప్పే.
--------------------
పెట్రోలు
ధర అర్ధ రూపాయి పెరిగితే పేపర్లలో మెయిన్ హెడ్డింగులు వేస్తారు. టోల్ గేటు, పార్కింగ్
ల ఫీజుల గురించి ఎవరూ మాట్లాడరు.
------------
ఏంటిదీ?
ప్రో
నోట్?
నువ్వు
ఏది చేసినా వింతగా చేస్తావూ? కొంపదీసి నోటరీ కూడా చేయించావా?
కొంప
తీయకుండానే నోటరీ చేయించాను.
నోటరీ
చేసిన ప్రోనోట్లు ఎప్పుడూ దగ్గర పెట్టుకుని తిరుగుతుంటావా?
డబ్బు
అవసరం ఎప్పుడు వస్తుందో తెలీదు కదా?
మనకు
అవసరంవచ్చినపుడు నోటరీ దొరకడుగా.
ఆమె
గట్టిగా నవ్వేసింది.
ఇందులో
వడ్డీ గిడ్డీ అని ఏమీ రాయలేదుగా?
నోనోనో.
నాకు తెలుసుగా ముస్లీంలు వడ్డీ తీసుకోరనీ?
--------
---- -
నీకు
తెలుసా ? నేను ఎవ్వ్వరికీ వడ్డీ కట్టను.
నువ్వు
అసలు ఇస్తే చాలు.
-------------
An IOU (abbreviated from the phrase "I owe you") is usually an
informal document acknowledging debt. An IOU differs from a promissory note in that
an IOU is not a negotiable instrument and does
not specify repayment terms such as the time of repayment.
-------------------
విధివంచితుల్ని
వంచితులు అనకూడదు. పాపం!
---------------
ఎవరిస్తే
ఏమిటీ? డబ్బు డబ్బే.
ఆ
లోకంలో కులం, మతం, రంగు, ప్రాంతం వగయిరా వగయిరా క్వాలిఫికేషన్స్ లేనిది డబ్బు ఒక్కటే.
-----------------
ఈ
డబ్బును బెజవాడ రౌడీ బ్యాంకులో జమ చేసింది కావచ్చు.
పాకిస్తాన్
కు మన దేశ రహాస్యాలు అమ్మేసినవాడు బ్యాంకులో జమ చేసింది కావచ్చు.
ఒక
పేదవాడు కొడుకు చదువు కోసం బ్యాంకులో దాచి వుంచింది కావచ్చు.
-------------
ఇప్పుడు
నీ కన్నూ రెండు చేతులా సంపాదిస్తున్న యంగ్ విడోల మీద పడినట్టుందిగా. ఇప్పుడు నీ ఖాతాలో అలాంటివాళ్ళు
ఎంతమంది వున్నారూ?
------------------------
ఆమె ముఖం అదీ కడుక్కోవడానికి కొంచెం టైమ్ ఇవ్వాలిగా.
ముఖం
సరే. అదీ అంటే?
----------
కొన్ని
పనులు పగలు వుంటాయి. వాళ్ళు రాత్రుళ్ళు పడుకుంటారు.
కొన్ని
పనులు రాత్రుళ్ళు వుంటాయి. వాళ్ళు పగలు పడుకుంటారు.
---------------
నేను
కరెక్టుగా తెల్లారగానే లేస్తాను.
అయితే,
ఇండియాలో తెల్లారినపుడుకాదు. అమెరికాలో తెల్లారినపుడు.
నీకో
విషయం తెలుసా? నాదీ ఐటీ వాళ్ళ వర్క్ టైమింగ్
ఒకటే.
వర్క్ ఒకటి కాదు.
-------------
ఐటీ
బూమ్ నడిచినపుడు ఈ హోటళ్ళన్నీ కళకళ లాదేవీ.
ఇప్పుడు
వీటికీ క్రాష్ కొట్టింది.
---------
డబ్బున్న
వాళ్ళకు రోగాలు రావాలని శపించేది కమ్యూనిస్టులు అనుకుంటాము.
అది
నిజం కాదు. డాక్టర్లు
డబ్బున్న
వాళ్లకు జబ్బులు వస్తేనే డాక్టర్లకు డబ్బులు వస్తాయి.
పేదవాళ్ళు
జబ్బు వచ్చినా హాస్పిటల్ కు వెళ్ళరు. వెళ్ళినా పెడ్డ ఫీజులు ఇచ్చుకోలేదు.
-------- -----
పెద్దలు
ఎందుకో స్రోగ్యమే మహాభాగ్యము అంటారు.
నిజానికి
మహాభాగ్యమే ఆరోగ్యము.
---------------------
నీ
ఆర్డర్ నువ్వు చెప్పుకో నా ఆర్డర్ నేను చెప్పుకుంటాను.
టేబుల్
మీద ఇద్దరం అన్నీ కలిసి తిందాం.
లవర్స్
అన్నాక ఒక్రి ఇష్టాలు మ్రొకరు పంచుకోవాలి.
---------------------
నువ్వు
ఒక రాకుమారిలా ఒక దేవకన్యలావుంటావనుకున్నాను.
---------
నీకు
ఎన్ని పనులు వచ్చూ?
ఎన్నిపనులు
వచ్చూ అన్నది కాదు అడగాల్సింది ఎన్ని పనులు చేస్తున్నావూ? అని అడగాలి.
అన్ని
పనులూ చేస్తున్నాను. మొన్నటి వరకు ఒకటి తక్కువగా వుండింది.
టాయ్
లేట్ శుభ్రం చేయడం
కంగ్రాట్స్
కరెక్టుగా గెస్ చేశావు. సరైన సమాధానం చెప్పినందుకు నీకూ చందనా బ్రదర్స్ వారి ఫ్యాన్సీ
శిల్కుచీర టోటల్లీ ఫ్రీ.
మనం
జీతం ఇవ్వని కారణంగా ఈమధ్య మా ఇంట్లో పని మనిషి మానేసింది.
ఇప్పుడు
టాయ్ లెట్లు మనమే శుభ్రం చేస్తున్నాం.
---------
--
అమ్మాయిలు
అద్దంలాటివాళ్ళు.
అందులో
ఎవరు చూస్తే వాళ్ళే కనపడతారు.
అటూ
వైపు ఏముందో ఎప్పటికీ అర్దం కాదు.
అబ్బాయిలు
గ్లాసు లాంటీవాళ్ళు ఎటునుంచి చూసినా లోపల ఏమున్నదో కనిపించిపోతుంది. టోటల్లీ ట్రాన్స్
పెరెంట్
ఏదైనా
వుంటే కదా కనిపించడానికీ?
-----------
నీకు
పెళ్ళయిందని ఎవరో చెప్పారే.
విడిపొయినట్టు
ఎవరూ చెప్పలేదా?
ఎందుకూ?
వేరీ
సింపుల్
పెళ్ళి
చేసే సమయంలో ఎవరయినా ఏం చూస్తారూ?
పర్మనెంట్
ఉద్యోగం, పెద్ద జీతం, మంచిఇల్లు, కారు, బ్యాంకులో
సేవింగ్స్.
ఇవన్నీ
అరేంజ్ డ్ మ్యారేజ్ రిక్వైర్ మెంట్స్
లవ్
మ్యారేజ్ లో డిస్కౌంట్ వుంటుందన్నది ఒక భ్రమ.
అక్కడ
అడిషనల్ రిక్వైర్ మెంట్స్ కంపాటి బిలిటీ, వీకెండ్ లో లాంగ్ డ్రయివ్ లు, ఎల్ టీ ఏ లు.
ఇంతకు
ముందు లవ్ మేరేజ్ లో రిలీజియన్, క్యాస్ట్ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు సబ్ క్యాస్ట్
కూడా పట్టించుకుంటున్నారు.
నీ
సంగతి చెప్పు.
నా
దగ్గర ఫుల్లుగా అన్ని క్వాలిఫికేషన్స్ లేకపోయినా కొన్ని వుండేవి. అప్పుడే పాపం తనది
కాంప్రమైజ్ మ్యారేజి.
పెళ్ళయ్యాక
మనకు వున్న క్యాలిఫికేషన్స్ కూడా పోయాయి.
ఆ
తరువాత ఆ పెళ్ళామూ పోయింది.
నువ్వు
ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదా? నచ్చ చెప్పలేదా?
అది
స్వార్ధం అవుతుంది.
మనకు
అర్హత లేనపుడు ఇంకొకరి నుండి ఆశించరాదు.
వాళ్లకు
మంచి బతుకు దొరుకుతున్నప్పుడు మనం ఆపరాదు
ఆమె
ఇంకొకర్ని పెళ్ళి చేసుకుందా?
ఊ
ఎవర్నీ?
అన్ని
క్వాలిఫికేషన్స్ వున్న వాడిని.
---------------
నువ్వు
ఓ డాక్టర్ని పెళ్ళి చేసుకున్నట్టున్నావుగా?
అది
జరగలేదు.
ఏం?
ముందు
అంతా చాలా మంచివాడిగానే కనిపించాడు.
తన
ప్రాక్టీస్ తో హాయిగా బతకవచ్చన్నాడు.
మా
అమ్మను ఇప్పటిలాగే చూసుకోవాలన్నాడు.
వెరీ
గుడ్. మరి ఆ తరువాత?
నర్శింగ్
హోమ్ కట్తడానికి ఫండ్స్ తగ్గాయి అన్నాడు.
అయ్యో.
అయ్యో
కాదు. నేను మా అమ్మ పేరున చేసిన సేవింగ్స్ తెమ్మని అన్నాడు.
మరి
అప్పుడు
పెళ్ళి
క్యన్సిల్ చేశా.పెళ్ళికి ముందే ఇన్ని మతలబులు చేస్తున్నవాడు రేపు పెళ్ళయ్యాక ఇంకేన్ని
మతలబులు చేస్తాడో అని భయపడ్డా.
-----------
ఇదే
పెద్ద సమస్య.
ఏమీ
వద్దన్నాడనికో వాడికి క్యాలిఫికేషన్లు లేవంటారు.
క్యాలిఫికేషన్లు
వున్నవాడు అన్నీ కావాలంటాడు.
జస్ట్
సప్లయి అండ్ డిమాండ్.
జీవితం
అంతకన్నా ఏమీకాదా?
జీవితం
అంతకన్నా గొప్పదే
మనుషులు
అంతకన్నా గొప్పగా ఆలోచించలేరు.
----------------
స్పృహ
కోల్పోయేంతగా తాగాలా?
నేను
స్పృహలో వుంటే కోపం వస్తుంది.
కోపం
వస్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది.
నేను
మాట్లాడితే నాకు పోయేదేమీలేదు.
బట్,
ప్రసూకు ఇబ్బంది అవుతుంది.
ఆమెను
ఇబ్బంది పెట్టడంకన్నా
కళ్ళూ
చెవులూ మూసుకోవడమే బెటరు.
మందు
కొడితే కళ్ళూ చెవులు కూడామూసుకుపోతాయి.
అప్పుడప్పుడు
అదో బెనిఫిట్టు.
థింక్
పాజిటివ్.
--------------
ఆ
బ్యాగ్ ఏమిటీ?
అది
నా జీవితం. నా సర్వస్వం.
చచ్చాక
మనిషికి రెండూ మీటర్ల జాగా కావాలి.
బతుకున్నప్పుడు
ఓ మీటరు బ్యాగ్ కావాలి.
---------------------
వుండడానికి
ఇల్లులేదు గానీ మొత్తం హైదరాబాద్ నాదే.
నీకు
ఒక విషయం తెలుసా.
మనం
చిన్నచిన్న గదుల్లో వున్నప్పుడు వాటిని తెగ ప్రేమిస్తాం.
అది
కూడా పోయినపుడు తెలుస్తుంది ప్రపంచం చాలా విశాలమైనస్దని.
ఇల్లూ
వాకిలి లేనివాళ్ళు హైదరాబాద్ లో లక్ష మంది వుంటారు.
ఏ
షహర్ హమారా.
-------------------
మనం
దెబ్బతిన్న చోటే మనకు తెలిసిన ప్రపంచం వుంటుంది.
మన
ఫ్రెండే మనకు తెలిసినవాడు అనుకుంటాం. మన శత్రువు కూడా మనకు తెలిసినవాడే.
---------
సినిమా
ప్రేక్షకుల్లో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు నటులు కావాలని కలలు కన్నవాళ్ళే.
నటులు
కాలేకపోయామని వాళ్ళు సినిమాలను చూడడం మానేస్తారా?
తాము
నటులు కాకపోయినా ఎవరో ఒకరు నటులు అయినందుకు వాళ్ళకు అదో ఆనందం.
-----------------------
ఇక్కడ
ఎప్పుడయినా హలీమ్ దొరుకుతుంది.
హలీమ్
కు ఒక ప్రత్యేకత వుంది.
ఇది
ఒరిజినల్ గా ఇరాన్ వంటకం.
ఇప్పుడు
హైదరాబాద్ లో తయారై ఇరాన్ కు ఎగుమతి అవుతోంది.
ఎందుకో
తెలుసా మిక్సిడ్ కల్చర్.
ఇరాన్
హలీమ్ కు హైదరాబాద్ స్పైసెస్ కలిపితే కొత్త రుచి వస్తుంది.
దట్స్
ఇట్.
---------
----
Comments
Post a Comment